బిగ్ బాస్ సీజన్ 5లోకి శ్రీరెడ్డి…ఇక రచ్చ రంబోలానే..

వివాదాస్పద నటి, సోషల్ మీడియాలో తరచూ మంటపుట్టించే కామెంట్స్ చేయడంలో దిట్ట అయిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టేందుకు సిద్ధం అయిపోతోంది. ఇప్పటికే తెలుగులో 4 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో తాజాగా 5వ సీజన్ కోసం సిద్ధం అవుతోంది. అయితే అటు త‌మిళ్‌లో కూడా ఐదో సీజ‌న్‌కి సంబంధించిన ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అటు కంటెస్టెంట్ల కోసం రెండు భాషల్లోనూ ఇప్పుటి నుంచే స్టార్ టీవీ టీమ్ వెతుకులాట ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ వివాదాస్పద న‌టి శ్రీ రెడ్డిని బిగ్‌బాస్ కోసం సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. కానీ అయితే తెలుగు బిగ్‌బాస్ కోసం అనుకుంటే పొరపాటే ఈ సెన్సేషనల్ అమ్మడిని త‌మిళ్ బిగ్‌బాస్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు నాట న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గానూ, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించిన ఈ భామ ఏ ఫిలిం బై అరవింద్ పార్ట్ 2లో తళుక్కుమంది. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో టాలివుడ్ ఇండస్ట్రీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. అది కాస్తా ఆ నోటా ఈ నోటా చేరి, చివరకు ప్రధాన టీవీ చానెల్స్ అన్నీ శ్రీరెడ్డితో డిస్కషన్స్ చేసే స్థాయికి చేరింది. చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం ఈ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నంచడంతో చర్చ కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. అయితే సడెన్ గా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరమైన ఈ భామ అడపా దడపా సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాదు ఈ భామ ప్రస్తుతం తన మకాం చెన్నైకి షిఫ్ట్ చేసినట్లు సమాచారం.

అటు త‌మిళ్‌లో బిగ్‌బాస్‌కి క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్య‌తగా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే అక్క‌డ బిగ్‌బాస్ 5ను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నారు.ఈ క్ర‌మంలో కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో శ్రీరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన శ్రీరెడ్డి.. టాలీవుడ్‌ తో పాటు తమిళ నటులపై కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ అక్కడ కూడా తెగ ఫేమస్ అయిపోయారు. గతంలో డాన్స్ మాస్టర్ లారెన్స్, అలాగే ఉదయనిధి స్టాలిన్ లను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. గ‌త రెండేళ్లుగా చెన్నైలో ఉంటోన్న శ్రీరెడ్డి బిగ్‌బాస్ లోకి అడుగుపెడితే అది సంచలనం అవుతుందని అంతా భావిస్తున్నారు. శ్రీరెడ్డి అంటేనే కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్. బిగ్ బాస్ షోకు ఇలాంటి వారే కావాలి. అందుకే త‌మిళ బిగ్‌బాస్ నిర్వాహ‌కులు శ్రీరెడ్డిని బిగ్‌బాస్ 5లోకి తీసుకోబోతున్న‌ట్లు టాక్. మ‌రి ఇందులో నిజ‌మెంతె తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వారం ఆగాల్సిందే.

Leave a Reply