యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న వకీల్ సాబ్…సత్యమేవ జయతే సాంగ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నుంచి మరో సాంగ్ విడుదలైంది. సత్యమేవ జయతే పేరిట రిలీజైన పాట చక్కటి రెస్పాన్స్ అందుకుంటోంది. సాంగ్ విడుదలైన గంటలోనే ఏకంగా మిలియన్ వ్యూస్ అందుకొని ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం. బాలీవుడ్ లో ప్రజాదరణ పొందిన పింక్ చిత్రానికి వకీల్ సాబ్ రీమేక్ గా ముందుకు వస్తోంది. చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. హిందీ పింక్ సినిమాలో నటించిన తాప్సీ కేరక్టర్ లో నివేదా థామస్ పోషిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సత్యమేవ జయతే పాట బుధవారం రిలీజ్ అయిన వెంటనే యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఈ పాటకు సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించారు. ఈ పాట పవన్ కళ్యాణ్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా డైరెక్టర్ జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకర్తలుకు కూడా ఉత్సాహం నింపేలా ఈ పాట కనిపించడం విశేషం.

పేదోళ్ల తరఫున నిలబడతాడు.. నిజం మనిషిరా.. కష్టమంటే వెంటనే అండగా ఉంటాడు.. అసలు మనిషిరా అంటూ రామజోగయ్య కలం నుంచి జాలువారిన పదాలు పవర్ స్టార్ పాటకు మరింత పవర్ ఇచ్చాయి. థమన్ కూడా పవన్ అభిమానులు కోరుకునేలా బీట్ ఇచ్చాడు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. #VakeelSaab హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

జన జన జన.. జనగణమున కలగలిసిన జనం మనిషిరా.. సత్యమేవ జయతే.. సత్యమేవ జయతే..” అనే లిరిక్స్‌తో వచ్చిన ఈ పాట ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాలుగు సినిమాలు ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు. ఇప్పటికే వకీల్ సాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

అలాగే దర్శకుడు క్రిష్ తో కూడా సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమా 15 రోజుల షూటింగ్ చేసాడు క్రిష్. మరోవైపు హరీష్ శంకర్ సినిమా కూడా లైన్‌లోనే ఉంది. మరోవైపు సురేందర్ రెడ్డి సినిమా కూడా పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే రాబోతుందని తెలుస్తుంది.

Leave a Reply