బంగారం ధర ఎందుకు పడిపోతుందో కారణాలివే…

బంగారం ధరలు రానురాను భారీగా పడిపోతున్నాయి. ఢిల్లీ సరాఫా బజార్ గోల్డ్ మార్కెట్లో తొలిసారిగా ఈ ఏడాది 10 గ్రాముల మేలిమి బంగారం ధర 45 వేల దిగువకు పడిపోయింది. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 44,610 వద్ద స్థిరపడింది. అయితే బులియన్ మార్కెట్లో ధరల తగ్గుదల వెనక అటు అంతర్జాతీయ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కరోనా వ్యాక్సిన్ రెండో దశ దేశవ్యాప్తంగా ప్రారంభం కావడం ఒక పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ కాలంలో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలు అయ్యింది. దీంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు తమ సంపదను కాపాడుకునేందుకు బంగారంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. ముఖ్యంగా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఓ కారణం ఉంది. బంగారాన్ని సేఫెస్ట్ పెట్టుబడిగా భావిస్తారు. ఎందుకంటే బంగారం ధరలో హెచ్చతగ్గులు చాలా స్వల్పంగా ఉంటాయి. అంతేకాదు బంగారం ఫిజికల్ రూపంలోనూ, బాండ్ల రూపంలోనూ కొనుగోలుచేసే వీలుంది. ఫలితంగా మదుపరులు స్టాక్ మార్కెట్లలో తమ సంపద కోల్పోతున్నామని పసిగడితే మాత్రం వెంటనే బంగారం వైపు తమ సంపదను పెట్టుబడిగా పెడతారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతాయి. డిమాండ్ పెరిగే కొద్ది బంగారం ధర కూడా పెరుగుతుంది. అయితే బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం వెనుక కరోనా టీకాయే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు బంగారం ధరలు పడిపోవడం వెనుక కారణం అటు బంగారం తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఇటీవల యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో యీల్డ్స్‌ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ భారీ ఉపశమన ప్యాకేజీకి ప్రకటించనున్నారు అనే వార్త నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కంటే షేర్ మార్కెట్ ఈక్విటీలు తదితర పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. అంతేకాదు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా బాగా కలిసి వచ్చింది. ఫలితంగా బంగారం ధరలు రూ. 45,000 మార్క్‌ దిగువకు చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధరలు మరింత తగ్గే చాన్స్ ఉంది.

Leave a Reply