జుట్టును అతిగా దువ్వుతున్నారా…? జాగ్రత్త..!

ముఖానికి అందం తెచ్చేది ఒత్తైన జుట్టే. కేశాలు ఒత్తుగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? వాటిని ఎలా సంరక్షించుకోవాలి? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎలా పడితే అలా దువ్వడం మంచిదేనా? ఎలాంటి షాంపూను ఎంచుకోవాలి? అందమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే ఇలా ప్రతీ సందేహం కలుగుతుంది. జుట్టు పొడువుగానా…పొట్టిగానా…ఎలా ఉన్నా సరే చాలామంది ఎలాపడితే అలా దువ్వుతూనే ఉంటారు. దీని ఫలితంగా జుట్టు ఊడిపోతుందని తెగ బాధపడుతుంటారు. మరి కేశాలను సంరక్షించుకుని…అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..

ఎక్కువగా దువ్వకండి…

చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. జుట్టను ఎలాపడితే అలా దువ్వేస్తుంటారు. అతిగా దువ్వితే మాడుకు రక్తప్రసరణ జరుగుతుందని…కురులు మెత్తగా మెరుస్తూ ఉంటాయనుకుంటారు. సహజసిద్ధంగా తయారు చేసిన నూనెను మాడుకు అప్లై చేసినట్లయితే….మాడు భాగంలో ఉన్న అన్ని కేశాలకు అందుతాయి. జుట్టుకు కావాల్సినంత పోషణ లభిస్తుంది. అంతేకానీ ఎలాపడితే అలా దువ్వకూడదు. జుట్టును ఎక్కువగా దువ్వితే…వెంట్రుకలు లాగినట్లయివుతాయి. దీంతో కేశాల కుదుళ్లు దెబ్బతింటాయి. జుట్టు కొనలు చిట్లుపడతాయి. ఇక ఒత్తుగా ఉన్న జుట్టుకు, పలుచుగా ఉన్న జుట్టుకు ఒకటే దువ్వెన వాడుతుంటారు. అలా చేయకూడదు. ఒత్తుగా, రింగురింగులుగా ఉన్న జుట్టుకు వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనను ఎంపిక చేసుకోవాలి. ఇక ఎక్కువగా చిక్కుపడే వెంట్రుకలకు బ్రెష్ ను సెలక్ట్ చేసుకోవాలి. మీ జుట్టు ఎలా ఉందో దాన్ని బట్టి దువ్వెనను సెలక్ట్ చేసుకోవాలి.

కేశాలకు నూనె మర్దన చేయడం మంచిదేనా?

ఈ కాలం అమ్మాయిలు, అబ్బాయిలు తలకు నూనె పట్టించాలంటే….చాదస్తంగా ఫీలవుతుంటారు. కానీ కురులకు కావాల్సినంత పోషణ అందించాలంటే వెంట్రుకలను నూనె రాయాల్సిందే. చాలా వరకు వెంట్రుకల సమస్యలకు నూనె అప్లయి చేయడమే చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. వారానికి రెండు నుంచి సార్లు తలస్నానం చేయడం ఎంత ముఖ్యమో….స్నానానికి ఒక గంట ముందు వెంట్రుకలకు ఆయిల్ మసాజ్ అంతే అవసరం. ఎందుకంటే స్నానానికి గంటముందు ఆయిల్ మసాజ్ చేసినట్లయితే…జుట్టు పొడిబారిపోకుండా…రాలకుండా ఉంటుంది. ఇక కొబ్బరినూనె, ఆముదం, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.

Leave a Reply