బరువు తగ్గాలంటే…పొట్టుతీయని ధాన్యం తినాలా?

శరీరానికి తగినంతగా పీచు పదార్థాలు తీసుకోకుంటే వచ్చే అనార్థాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో డాక్టర్లు, న్యూట్రిషన్లు చాలా వరకు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లలో ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. అంతేకాదు పొట్టుతో ఉన్న ధాన్యాలలోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే కావాల్సినంత ఫైబర్ శరీరానికి అందుతుంది. అందుకే చిరుధాన్యాలు ఆరోగ్యానికి అనుకూలామైనదిగా నిర్థారణ అయినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ ధాన్యాలకు పొట్టు ఉండటంతో నెమ్మదిగా జీర్ణం అవుతుందట. ఈ పొట్టు తీయని ధాన్యాలను ఆహారంగా తీసుకున్నట్లయితే….శరీరంలో షుగర్ విడుదల కూడా నెమ్మదిగా జరుగుతుంది.

దీని ఫలితంగా ఒంట్లో ఇన్సూలిన్ రిలీజ్ సిస్టమ్ కంట్రోల్ గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బార్లీ, ఓట్స్, పెసర్లు, మినుములు,గోధుమలు, వరి లాంటివి పొట్టుతో ఉన్నవి తీసుకున్నట్లయితే బరువు పెరగకుంటా కంట్రోల్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల….మిగతా పొట్టుతీసిన బియ్యంతో పొల్చినట్లయితే తక్కువగా బరువు పెరుగుతారు. ఇలా చేస్తే….అధిక బరువును కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు అధిక బరువుతో వచ్చే సమస్యలను కూడా నియంత్రించుకోవచ్చంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో పబ్లిష్ చేశారు.

Leave a Reply