పొగతాగే తండ్రులు జరజాగ్రత్త….?

పొగతాగే తండ్రులు జరజాగ్రత్త. మీ అలవాటు పిల్లల పాలిట శాపంలా మారనుంది. తల్లిదండ్రులకు పొగతాగే అలవాటుంటే పిల్లలకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని బ్రాడ్ ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యాయనం తెలిపింది. అందులో ముఖ్యంగా ల్యుకేమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. శాస్త్రవేత్తలు దీనికి కారణాన్నికూడా చెబుతున్నారు. జన్యువులను పిల్లకు అందించే వీర్య కణాల్లో డీఎన్ ఏ ….పొగత్రాగడం వల్ల చాలా వరకు దెబ్బతింటుందట. దీంతో డీఎన్ ఏ లోపం వల్ల పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే ఈ రిస్క్ నుంచి బయటపడేందుక ఒక ఉపాయం కూడా ఉంది.

దంపతులు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న సమయం కంటే….అంటే…దాదాపు మూడు నెలల ముందే పొగతాగడం మానుకోవాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. డాక్టర్ డయానా యాండర్సన్ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. ఒక వీర్యకణం ఉద్భవించి పూర్తి స్థాయిలో పరిణితి చెందడానికి దాదాపుగా మూడు నెలల సమయం పడుతుందట. అందుకే కనీసం మూడు నెలల వరకు పొగతాగడం మానేయాలని చెబుతున్నారు. బలహీన వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి….పిల్లల్లో క్యాన్సర్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పారు. తమకు ఆరోగ్యకరమైన పిల్లలు జన్మించాలన్నా…పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా తల్లిదండ్రులు పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం పేర్కొంది.

Leave a Reply