అక్కను చంపిన తమ్ముడు..గుజరాత్ లో పరువు హత్య !

దేశంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదోక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానంతో సొంత అక్కనే దారుణంగా చంపాడు తమ్ముడు. హత్యానంతరం పారిపోకుండా పోలీసులు వచ్చేంత వరకు శవం వద్దే ఉన్నాడు. పట్టపగలు ఈ దారుణం జరిగినా…అక్కడున జనం అడ్డుకోకపోవడాన్ని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్దతి మార్చుకోమని ఎన్నోసార్లు హెచ్చరించినా…వినలేదని….కుటుంబం పరువు కాపాడేందుకే ఈ హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు చెప్తున్నాడు. ఈ దారుణం గుజరాత్ లోని బరోయి గ్రామంలో జరిగింది.

రేణాబాయి గత కొన్ని సంవత్సరాలుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇది తెలుసుకున్న తన తమ్ముడు నరూభా రాథోడ్….పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు. తమది పద్దతిగల కుటుంబం అని గౌరవాన్ని కాపాడాలని వేడుకున్నాడు. అయినా…తన తీరు మార్చుకోకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం అందరు చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రాథోడ్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తమ కుటుంబ పరువును కాపాడుకునేందుక అక్కను హత్య చేశానని నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇక తన అక్కను రాథోడ్ హత్య చేస్తుండగా చాలా మంది ఫోటోలు వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో పలువురు మండిపడుతున్నారు.

Leave a Reply