చంద్రబాబు రాజకీయం ముగిసినట్లేనా…కమ్మ కులపెద్దల సంచలన నిర్ణయం…

2024లో తెలుగు దేశాన్ని మరో సారి అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అహోరాత్రాలు కృషి చేస్తున్నారు. 71 ఏళ్ల వయస్సులో చంద్రబాబు అలుపు ఎరగకుండా పనిచేస్తున్నారు. నిజానికి ఆయనతో పాటు రాజకీయాలు స్టార్ట్ చేసిన వారు ప్రస్తుతం రేసు నుంచి విరమించుకొని తాపీగా జీవితం గడుపుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం బాధ్యతలను తలపై పెట్టుకొని నడుస్తున్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే, చేతికి అందిరావాల్సిన చినబాబు లోకేష్ ఇంకా రాజకీయంగా ఓనమాలు దిద్దే స్థితిలోనే ఉన్నారు. అంతేకాదు అటు అధికారాన్ని చేపట్టే చాణక్యం కానీ, ప్రజల్లో చరిష్మా కానీ రెండూ లోకేష్ లో లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అయితే చంద్రబాబు ఇఫ్పటికే జగన్‌కు హెచ్చరికలు, ప్రభుత్వం పై విమర్శలు టీడీపీ కార్యకర్తలతో గంటలకొద్దీ టెలికాన్ఫ‌రెన్సులు, నాయకులతో వీడియో కాన్ఫ‌రెన్సులు, మధ్య మధ్యలో ట్వీట్లతో హడావిడి చేసినప్పటికీ, తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే దీని వెనుక చంద్రబాబు నాయుడు చాణక్యం ఉందని అంటున్నారు. ఎందుకుంటే ఆయన రూపాయి బిళ్ల కూడా ఖర్చు పెట్టకుండా అలసు టీడీపీకి ఎన్ని ఓట్లు పడతాయో, అంచనా వేసుకున్నారని టీడీపీ వర్గాల టాక్. అలా చూస్తే టీడీపీకి ఎలాంటి ఖర్చు చేయకుండా 30 శాతం ఓట్లు సాధించుకుందని, అయితే ప్రస్తుతం పడ్డ ఓట్లను చూస్తే టీడీపీ ఇంతకన్నా దిగజారే పరిస్థితి ఉండదని అంచనాకు వచ్చారట చంద్రబాబు.

కానీ అటు అధికార వైసీపీ మాత్రం ఏకంగా 2019 ఎన్నికల కన్నా కూడా 4 శాతం ఎక్కువ ఓట్లు రాబట్టింది. అంటే 50 శాతం పైన ఓట్లు కూడగట్టగలిగింది. అయితే 2024 నాటికి టీడీపీ ఎంత ప్రయత్నించినా, 40 శాతం ఓట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆర్థికంగానూ, అన్ని రకాలుగానూ ఆదుకుంటున్న కమ్మ సామాజిక వర్గం ప్రస్తుతం చంద్రబాబుపై అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఇదే విషయం ఆ కులానికి చెందిన పలు మీడియా సంస్థ అధినేతలతో వ్యక్తం చేశారట, అటు తెలంగాణలో కూడా కమ్మ సామాజిక వర్గం టీడీపీని వదిలి టీఆర్ఎస్ తో జతకట్టగా, ఏపీలో కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు కమ్మ సామాజిక వర్గం చూస్తోందని వాపోయారు. చంద్రబాబు టీడీపీకి చేస్తున్న సేవలు మరువలేనివే అయినప్పటికీ, ఆయన శక్తి సరిపోవడం లేదని వాదన వినిపిస్తోంది. నాయకత్వ మార్పు జరిగితేనే భవిష్యత్తు ఉందని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారట.

Leave a Reply