కోపంగా ఉన్నారా ...ఈ సమస్య ఉన్నట్లే

21-March-2021

ప్రతీ మనిషికి కోపం అనేది శత్రువు లాంటిది...అది విచక్షణ కోల్పోయేలా చేస్తుంది..అయితే కోపం, చిరాకు వెనుక అసలైన కారణం నిద్రలేమి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..

istock

ప్రతీ మనిషి కనీసం రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రించాలి...లేకపోతే మెదడు సంతులనం దెబ్బతింటుంది. దీని ప్రభావం గుండె అలాగే రోగ నిరోధక వ్యవస్థపై పడుతుంది

istock

నిద్రలేమి కారణంగా మనిషి అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ కారనంగా కోపం, చిరాకు లాంటివి కలుగుతాయి...

istock

నిద్రలేమితో జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే సమయానికి నిద్రపోయి, సమయానికి ఆహారం భుజించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

istock

నిద్రలేమి కారణంగా మెదడులో ‘అమిగ్‌డాలా’ అనే రసాయనం పనిచేయడం మానేస్తుందని  ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది.

istock

ముందు రోజు రాత్రి హాయిగా నిద్ర పోతేనే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి ఉదయం పూట ఉత్సాహంగా ఉంటాం.

istock

కోపానికి, నిద్రకు సంబంధం ఉందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిద్రలేమి వల్లనే కోపం వస్తుందని, అలాగే అసహనం పెరుగుతుందని చెబుతున్నారు.

istock

శరీరంలోని అన్ని నిర్మాణ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం.

istock

నిద్ర సక్రమంగా పట్టేందుకు చక్కటి వ్యాయామంతో పాటు కొవ్వు పదార్థాలు, లేని ఆహారం తీసుకోవడం అత్యంత ఆవశ్యకం.

istock

మరిన్ని వివరాలు...వార్తల కోసం