కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పొందడం ఎలా..

18-March-2021

By the news voice

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నారు.

istock

కోవిడ్ -19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్, ఆరోగ్య సేతును కో-విన్ పోర్టల్‌తో అనుసంధానం చేసి.. వినియోగదారులు టీకా ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని సులభతరం చేసింది.

indiatv

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఎలాంటి సమాచారం కావాలన్నా ఆరోగ్య సేతు యాప్ ద్వారా లభ్యమవుతుంది.

istock

COVID-19 టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయండిలా.. మొదటిగా కో-విన్ అధికారిక వెబ్‌సైట్‌ Cowin.gov.inను సందర్శించాలి.

istock

మీ 10-అంకెల మొబైల్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.

istock

రిజిస్ట్రేషన్ కోసం ఫోటో గుర్తింపు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి

istock

మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలను నమోదు చేయాలి.

istock

మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, షెడ్యూల్ చేసిన తేదీ, సమయానికి టీకా కేంద్రాన్ని సందర్శించి.. వ్యాక్సిన్ వేయించుకోండి.

istock

దీని తరువాత, మీరు మీ టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకోగలిగే రిఫరెన్స్ ఐడిని అందుకుంటారు. కరోనా వ్యాక్సిన్ ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటుంది.

istock

మరిన్ని వివరాలు - వార్తల కోసం