daily express
మధుమేహగ్రస్తులు షుగర్ తినొచ్చా..?
17-March-2021
By the news voice
pexels
మధుమేహంతో ఉన్నవారికి చక్కెరను శత్రువుగా భావిస్తుంటారు..చక్కెర రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెంచడానికి దోహదపడుతుంది.
pexels
మధుమేహం ఉన్నవారు చక్కెర వాడకపోవడమే మంచిది. ఎందుకుంటే ఇందులో కెలోరీలు అత్యధికంగా ఉంటాయి.
pexels
మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీపి పదార్ధాలను పూర్తిగా మానెయ్యడం కానీ చాలా తక్కువ మోతాదులో, కేవలం వారానికో నెలకో ఒకసారి మాత్రమే తీసుకోవాలి.
pexels
టీలు కాఫీల ద్వారా రక్తంలోకి గ్లూకోజు చేరవేస్తున్నప్పుడు అది చక్కెరయినా బెల్లమైనా మధుమేహం ఉన్నవారికి ప్రమాదమే.
pexels
టీ కాఫీలు ఎటువంటి తీపి లేకుండా తీసుకోవాలి. లేదంటే పూర్తిగా వాటిని తాగడం మానెయ్యడమో చేయడం శ్రేయస్కరం.
pexels
చక్కెరతో చేసిన మిఠాయిలను తినడం మధుమేహం ఉన్నవారికి కూడా మంచిది కాదు. ఎటువంటి తీపి వస్తువులైనా అలవాటుగా ప్రతిరోజూ తీసుకుంటే అదే అనారోగ్యానికి దారి తీస్తుంది.
samayam
మధుమేహం ఉన్నవాళ్లు ఎక్కువ పంచదార తింటే శరీరాన్ని కాపాడే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. శరీరంలోని టిష్యూలు సంకోచ, వ్యాకోచాలను కోల్పోయి గట్టిగా అయిపోతాయి.
indian express
ఎక్కువగా పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల.. శారీరకంగా నిస్సత్తువగా, , డిప్రెసివ్ గా ఉంటారు. షుగర్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఒత్తిడి నుంచి బయటపడినా.. తర్వాత ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
Health
మధుమేహం శరీరంలో ఎల్డీఎల్ లేదా చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు వారు తీసుకునే ఫుడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.