ఏ బియ్యం తింటే శరీరానికి మంచిది
17-March-2021
By the news voice
ప్రపంచంలోని చాలా దేశాల్లో వరి బియ్యంను ఆహారంగా తీసుకుంటారు. మనదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా అన్నమే తింటారు.
istock
మన దేశంలో ఎక్కువగా పండించేది బియ్యమే. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు రోజూ మూడు పూటలా అన్నం లేనిదే ముద్ద దిగదు.
istock
నిజంగా అన్నం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఏ బియ్యం మంచివి.. ఏ బియ్యం మంచివి కావు.. అనే విషయం చాలామందికి తెలియదు.
istock
మనకు ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమయ్యే బియ్యాలు రెండు రకాలు. ఒకటి పాలిష్ బియ్యం.. దంపుడు బియ్యం, బ్లాక్ రైస్, రెడ్ రైస్ రకాలు కూడా ఉన్నాయి.
istock
ప్రస్తుతం 90 శాతం మంది తినేది పాలిష్ చేసిన బియ్యమే. దంపుడు బియ్యాన్ని చాలా తక్కువమంది తింటారు.
istock
బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యాన్ని ఎక్కువ మంది తినరు. ఎందుకంటే పాలిష్ బియ్యం రుచిగా ఉంటాయి. ముడి బియ్యం రుచిగా ఉండవు.
istock
ముడి బియ్యం ఆరోగ్యానికి మంచివి. 100 గ్రాముల ముడి బియ్యంలో 1.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యం 100 గ్రాముల్లో 0.4 శాతమే ఫైబర్ ఉంటుంది.
istock
పాలిష్ చేసిన బియ్యాన్ని అలాగే రోజూ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీంతో పోషకాహార లోపాలు వచ్చే ప్రమాదం ఉంది.
istock
మితంగా తీసుకుంటే ముడి బియ్యం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.
istock