మెంతులు - ఉపయోగాలు

16-March-2021

By the news voice

istock

మెంతులు మన పోపుల పెట్టె సామాగ్రిలో ఉండే సాధారణ వస్తువు అనుకుంటే పొరపాటే. దీనిలో ఉన్న ఔషధ గుణాలను గుర్తించి మన పెద్దలు ఆహారంలో తప్పనిసరి అని చేర్చారు.

zishta

మెంతులను పోపులో వేయడం వల్ల మంచి రుచి వ‌స్తుంది. అలానే మంచి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతుంది. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మెంతులను పోపుల్లోనూ, పచ్చళ్లలోనూ వాడుతారు.

Herbalkart

మెంతుల‌ను బాగా నాన‌బెట్టి రుబ్బిన‌ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టిస్తే చుండ్రు లాంటి సమస్యలు పోతాయి. పెరుగులో మెంతులను నానబెట్టి  జుట్టుకుపట్టిస్తే కుదుళ్లు ధృఢంగా మారుతాయి.

momspresso

నాన‌బెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటివ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతులను కఫ, వాత, పిత్తాలను నివారించేందుకు వాడతారు.

Herzindagi

అసిడిటి స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి మెంతులు బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ఖాళీ క‌డుపుతో నాన‌బెట్టిన అర టీస్పూన్ మెంతులు తినాలి. ఇలా చేస్తే అసిడిటి స‌మ‌స్య త‌గ్గుతుంది.

vaya.in

మెంతులు జీర్ణ సమస్యలను దూరంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి. నాన‌బెట్టిన మెంతులు జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డానికి కూడా తోడ్ప‌డుతుంది.  విరోచనాలను నిరోధించడంలో ఇవి సహాయపడతాయి..

indian express

రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డుతున్న వారికి నాన‌బెట్టిన మెంతులు చ‌క్క‌ని ప‌రిష్కారం. త‌ర‌చూ వీటిని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. గుండెకు కూడా మెంతులు చాలా మంచివి.

Aharam

ప్ర‌తిరోజూ నాన‌బెట్టిన మెంతులు తిన‌లేక‌పోతే కూర‌ల్లో వేసుకొని తినేలా చూసుకోవాలి. రోజుకి ఒక టేబుల్‌స్పూన్ కంటే మించి తిన‌కూడ‌దు. 21 రోజులు కంటిన్యూగా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

firstcry parenting

మెంతులను పేస్ట్ గా రుబ్బి శనగపిండిలో కలిపి ముఖంపై ఫేస్ ప్యాక్ లా వాడితే చర్మం కాంతి వంతంగా మారుతుంది. 

365 gorgeous

మరిన్ని వివరాలు - వార్తల కోసం