ఇలా చేస్తే ముఖంపై కొవ్వు కరిగిపోవాల్సిందే...
By the news voice
Herzindagi
నిత్యం కొంత సేపు బెలూన్లను ఊదితే ముఖానికి చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ముఖంపై ఉండే కొవ్వు కరిగి ముఖం అందంగా మారుతుంది.
Diaposable Helium
నిత్యం ఉదయం, సాయంత్రం 2 సార్లు 20 నిమిషాల పాటు చూయింగ్ గమ్‌లను నమిలితే మంచిది. ఇక ఆ చూయింగ్ గమ్‌లు కూడా షుగర్ లెస్వి అయితే మన శరీరంలో అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి.
ABC News
చేపల మాదిరిగా బుగ్గలను లోపలికి మడిచి నవ్వేందుకు యత్నించాలి. ఇలా 10 సెకన్లపాటు నిత్యం 15 సార్లు చేయాలి. దీంతో ముఖంలో ఉండే కొవ్వు కరిగి ముఖానికి చక్కని ఆకృతి వస్తుంది.
Bebeautiful
కళ్లను పెద్దవిగా చేసి, నోట్లో ఉన్న నాలుకను బయట పెట్టి సాగదీయాలి. అనంతరం నాలుకతో గడ్డాన్ని తాకే యత్నం చేయాలి. అలా 10 సెకన్ల పాటు నిత్యం 20 సార్లు చేస్తే ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది.
Huffpost
కార్డియో, ఏరోబిక్ వ్యాయామం ముఖంపై కొవ్వు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొవ్వు కరగడానికి, కొవ్వు తగ్గడానికి కార్డియో సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
Fitday
మద్యపానం అతిగా తీసుకోవడం వల్ల మీ ముఖంలో కొవ్వు, ఉబ్బరం పెరగడానికి దోహదపడుతుంది. ఆల్కహాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. మద్యపానం అధికంగా తీసుకోవడం వల్ల బరువుతోపాటు ముఖంలో కొవ్వు పెరుగుతుంది.
Unlock Food
ముఖంపై ఉన్న కొవ్వును తగ్గించటానికి నిద్ర సాయపడతుంది. నిద్ర లేమి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్, దీని వల్ల బరువు పెరుగటంతో పాటు అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.
123RF
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ముఖ వాపుకు కారణం అవుతుంది. సోడియం మీ శరీరానికి అదనపు నీటిని కలిగి ఉండటానికి కారణం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ద్రవం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
The active Times