హైదరాబాద్ లో 10 దర్శనీయ స్థలాలు

The news voice

Deccan Chornical

India tourism guideI

హైదరాబాద్ యొక్క అతి ముఖ్యమైన సూచిక 'ఛార్మినార్'. నాలుగు మినార్ లు కలిగిన కట్టడం కావడంతో దీనిని ఛార్మినార్ అని అంటారు. ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించింది. 

నగరంలోని ఐటీ కాపిటల్ గా పిలిచే మాదాపూర్లో ఉన్న దుర్గం చెరువును సీక్రెట్ లేక్ అని పిలుస్తారు. దీనిపై నుంచి నిర్మించిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రస్తుతం దర్శనీయ స్థలంగా మారింది.

Telangana today

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ చెరువు. నగర వాసులకు చల్లటి సాయంకాలపు విడిది అనే చెప్పాలి. దీని చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డులో ఆహ్లాదకరమైన పార్కులు విస్తరించి ఉన్నాయి.

DeviantArt

దీన్ని 7వ నిజాం నిర్మించాడు.  మొత్తం 1600 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీగా పిలవబడుతోంది. దేశంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఉస్మానియా ఒకటి.

New indian express

18వ శతాబ్ధం నాటి అద్భుతమైన చారిత్రక కట్టడం 'చౌమహల్లా ప్యాలెస్'. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన 5వ నిజాం పాలకుడు ఆసఫ్ జాహ్ వంశం నివాస స్థలం ఇది. హైదరాబాద్ నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంది.

Hyderabad tourism

హైదరాబాద్ పర్యాటకంలో ప్రముఖంగా చూడదగ్గ ప్రదేశాల్లో 'బిర్లా మందిర్' ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

Trawel.in

దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియంలలో 'సాలార్ జంగ్ మ్యూజియం' ఒకటి. ఈ మ్యూజియంలోని పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ III చేత సేకరించబడ్డాయి.

Nk realtors

నగరంలోనే ఉన్న నెహ్రూ జువలాజికల్ పార్క్ అంటే ఇప్పటికే ఎంతో ఫేమస్ అనే చెప్పాలి. ప్రపంచంలోని అనేక వింత జాతులకు చెందిన జంతువులను ఇక్కడ ప్రదర్శిస్తుంటారు.

400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. ఈ కోటలోని వాతావరణం పర్యాటకులకు 12వ శతాబ్ధం నాటి కాలాన్ని పరిచయం చేస్తుంది.

Military wiki