హైపర్ హైడ్రోసిస్ అంటే ఏమిటి? చికిత్స ఇదే..

15-March-2021

By the news voice

pexels

హైపర్ హైడ్రోసిస్ డిజార్డర్ అంటే శరీరంలో అధికంగా చెమట వస్తుంది. ఈ చెమట వాతావరణంతో సంబంధం లేకుండా  అసాధారణ పరిస్థితులలో సంభవిస్తుంది. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ చెమటలు పట్టడం దీని లక్షణం.

pexels

సాధారణంగా చెమట అనేది వేడి వాతావరణం లేదా శారీరక శ్రమ, ఒత్తిడి, భయం లేదా కోపం వంటి కొన్ని పరిస్థితుల్లో మాత్రమే పడుతుంది. అయితే హైపర్ హైడ్రోసిస్ ఫలితంగా సాధారణం కంటే ఎక్కువ చెమట పడుతుంది. 

pexels

ఈ వ్యాధి ఉన్నవారికి చెమట ప్రధానంగా పాదాలు, చేతులు, ముఖం, తల, అండర్ ఆర్మ్స్ మీద సంభవిస్తుంది. ఇది సాధారణంగా బాల్యంలోనే మొదలవుతుంది. కుటుంబ చరిత్ర కారణంగా కూడా ఇది సంభవిస్తుంది.

pexels

హైపర్ హైడ్రోసిస్ అనేది కొన్ని సార్లు మిడిల్ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు ఒక్కో సారి ఒళ్లంతా చెమటలు పడతాయి. దీనికి ప్రధానంగా ఔషధాల దుష్ప్రభావం కూడా కారణం కావచ్చు.

pexels

గుండె వ్యాధి, క్యాన్సర్, అడ్రినల్ గ్రంథి లోపాలు, హైపర్ థైరాయిడిజం, వెన్నుపాము గాయాలు, పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు కూడా ఎక్కువగా ఈ హైపర్ హైడ్రోసిస్ కు గురవుతారు.

pexels

అయితే అధికంగా చెమట పడుతుంటే కొన్ని చికిత్సలు ఉన్నాయి. చెమట  ప్రాంతంలో బ్యాక్టీరియా వదిలించుకోవడానికి రోజూ స్నానం చేయాలి. సహజ పదార్థాలతో తయారు చేసిన బూట్లు సాక్స్ ధరించాలి..

pexels

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను రాత్రిపూట పడుకునే ముందు ఒంటికి రాసుకోవాలి. మర్నాడు స్నానం చేస్తే చెమట ప్రభావం తగ్గుతుంది.

pexels

మూడుచెంచాల బేకింగ్‌ సోడాలో మూడు నాలుగుచుక్కలు ఏదైనా ఎసెన్షియల్‌ నూనె కలిపి రాసుకోవాలి. పావుగంటయ్యాక శుభ్రం చేసుకోవాలి. తరవాత నిమ్మరసం, బేకింగ్‌ సోడా  పూతలా వేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.

pexels

మాంసాహారం తగ్గించాలి. మద్యపానం, ధూమ పానాలకు దూరంగా ఉండాలి. అలాగే ఆహారపు అలవాట్లలో ప్రధానంగా మసాలా, ఆయిల్స్ తగ్గించాలి.

pexels