శివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాం...

By the news voice

English news

అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం.

Kerela

ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్దలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తుంటారు.

yogain india

పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు  మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం వస్తుంది

Ritiriwaz

santabanta

ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.  ఈ రోజునే ఆ పరమ శివుడు లింగరూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెపుతుంటారు.

పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం.. పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నేయి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి.

Prokerala

శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.

Fill in some text

seniority.in.

దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక  పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.

livechennai

పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన  చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు.

istock

ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి, బిల్వ పత్రాలతో శివపూజ చేసి, రాత్రి జాగరణ ఉంటారో వారిని శివుడు నరకం నుంచి రక్షించి, ఆనందం, మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

Beliefnet