స్థూలకాయం ఇలా  తగ్గించుకోండి..

15-March-2021

By the news voice

medical xpress

శరీర భాగాల్లో  కొవ్వు బాగా పేరుకు పోవడం వల్ల ఊబకాయం కలుగుతుంది. కొవ్వుపదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీర అవసరాలకు మించిన కొవ్వు పొట్ట, రొమ్ము, నడుము మొదలైన భాగాల్లోపేరుకుంటుంది.

The independent

అధిక కొవ్వు  కొలస్ట్రాల్ గా మారుతుంది. కొలెస్ట్రాల్ ప్రధానంగా గుండె, కాలేయం, మూత్రపిండాల పనితీరును ఆటంకపరుస్తుంది. హార్ట్ ఎటాక్  లాంటి ప్రాణాంతక జబ్బులకు దారి తీస్తుంది.

pexels

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు.. రోజూ ఉదయాన్నే రెండు టీ స్పూన్ల ముడి నువ్వుల నూనెను తాగటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కొలస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

pexels

గోరు వెచ్చటినీటిలో బాగా పండిన నిమ్మకాయ రసం పూర్తిగా పిండి దానిలో ఒక చెంచాడు తేనె కలిపి ఉదయాన్నే తాగుతుండాలి. ఇలా చేస్తే కొలస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే అధికబరువు తగ్గుతుంది.

pexels

రేగు ఆకులను దంచి ముద్దచేసి ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే నీరు వడబోసి, తాగితే ఊబకాయం తగ్గుతుంది.

pexels

ప్రతి రోజు పదిగ్రాముల త్రిఫల చూర్ణం  ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో తాగాలి. 40 రోజుల్లో అధిక బరువు తగ్గిపోయి శరీరం సన్నబడి అందంగా తయారవుతారు.

pexels

బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, ఫ్రైడ్, ఫాస్ట్‌ ఫుడ్, కార్బొనేటెడ్‌ డ్రింక్స్, రెడిమేడ్‌ కూల్‌ డ్రింక్స్‌ లాంటి జంక్‌ ఫుడ్‌ కు దూరంగా ఉండాలి.

pexels

ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించి బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు.

openfit

ప్రతి రోజు వ్యాయామం చేయాలి.  ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్‌ ఉన్న పదార్థాలు తినాలి.చిరుధాన్యాలు రెగ్యులర్ ఆహారంలో తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది.

pexels

విజిట్ ది న్యూస్ వాయిస్