ముల్లంగి ఉపయోగాలు.

15-March-2021

By the news voice

Health tips

క్యారెట్ లాగే ముల్లంగి కూడా శరీరానికి  ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగి ఆకుల నుంచి కింద దుంప వరకూ అన్నింట్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.

istock

పచ్చి ముల్లంగి దుంపలు తింటే మలబద్ధకం పోతుంది. అలాగే  విరేచననాలు తగ్గేందు కోసం కూడా ముల్లంగిని ఉపయోగిస్తారు. 

istock

ముల్లంగి విత్తనాలను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ అన్నంలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును.

istock

విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారికి ముల్లంగి రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముల్లంగిని ఆహారంలో తీసుకుంటే విటమిన్ ఏ దక్కుతుంది.

istock

మూత్రపిండాల్లోని రాళ్లు కరగాలంటే ముల్లంగి రసం తప్పనిసరి. ఇక ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అస్సలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదు.

istock

ఈ ముల్లంగి రసంలో కొద్దిగా నువ్వుల నూనెను కలుపుకుని వడబోసి ఒక డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఈ ముల్లంగి నూనె మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

pexels

అప్పుడప్పుడు కొంతమందికి చెవిపోటు వస్తుంటుంది. అటువంటి వారు ఈ ముల్లంగి నూనెను చెవిలో వేసుకుంటే వెంటనే మంచి ఫలితాలను పొందవచ్చును. 

pexels

ముల్లంగి రసాన్ని  ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. 

Kora.net

ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి.. అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి... తాగితే... మూత్ర సంబంధ మంట తగ్గుతుంది.

Healthy world

మరిన్ని వివరాలు...వార్తల కోసం